కొన్నేళ్లుగా నార్త్ బెల్ట్ లో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో రికార్డులు కూడా మొదలయ్యాయి. అలా టాప్-10 హిందీ డబ్బింగ్ ఫిలిమ్స్ లో ‘బాహుబలి-2’ మొదటి స్థానంలో ఉండగా.. ‘కేజీఎఫ్-2’ రెండో స్థానంలో కొనసాగుతోంది.
‘పుష్ప 2’ రాకతో ఇప్పుడీ లిస్ట్ లో మార్పులు జరుగుతున్నాయి. భారీ వసూళ్లతో బన్నీ సినిమా ఆల్రెడీ మూడో స్థానానికి చేరుకుంది. టాప్-10 హిందీ డబ్బింగ్ సినిమాల లిస్ట్ లో త్వరలోనే ఇది ‘కేజీఎఫ్-2’ను ఆక్రమిస్తుందనే అంచనాలున్నాయి.
‘పుష్ప 2’ సినిమాకు 5 రోజుల్లో 339 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ‘కేజీఎఫ్-2’ సినిమా 434 కోట్ల రూపాయల లైఫ్ టైమ్ వసూళ్లతో రెండో స్థానంలో ఉంది. ‘పుష్ప 2’ ఊపు చూస్తుంటే, మరో 4-5 రోజుల్లో రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
టాప్ 5 హిందీ డబ్బింగ్ సినిమాలు...
1. బాహుబలి 2 : 510.99 కోట్లు
2. కేజీఎఫ్ 2 : 434.70 కోట్లు
3. పుష్ప 2 : 339 కోట్లు (5 రోజులు )
4. కల్కి : 294.25 కోట్లు
5. ఆర్ఆర్ఆర్ : 274.31 కోట్లు