పవన్ కల్యాణ్ లిస్ట్ లో చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఎట్టకేలకు ఈ సినిమా కొలిక్కి వచ్చింది. మరో 10 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. అంతేకాదు, మరో వారం, పది రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా మేకర్స్ మరో వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. మూవీకి సంబంధించి పవన్ పార్ట్ మాత్రమే పెండింగ్. దాన్ని ఈ 2-3 రోజుల్లో పూర్తి చేయబోతున్నారు.
అయితే షూటింగ్ పూర్తవుతున్నది కేవలం పార్ట్-1 మాత్రమే. పార్ట్-2 ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతానికి పార్ట్-1 పూర్తి చేస్తారు. పార్ట్-2 సంగతి తర్వాత ఆలోచిస్తారు.
నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘హరిహర వీరమల్లు’. ఈ ప్రాజెక్టుకు మొదటి దర్శకుడిగా క్రిష్ పేరు తప్పకుండా టైటిల్ కార్డుల్లో పడుతుంది కానీ ప్రస్తుతానికి అతడికి సినిమాకు ఎలాంటి సంబంధం లేనట్టు కనిపిస్తోంది.