
సన్నీలియోన్ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం అక్కర్లేదు. పోర్న్ ప్రపంచం నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మినిమం గ్యాప్ లోనే తన అందాలతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కెరీర్ ప్రారంభంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా దొరికిన అన్ని పాత్రలు చేసిన ఈ నటి, ఆ తర్వాత మెల్లమెల్లగా కెరీర్ ను నిర్మించుకునే పనిలో పడింది.
ప్రస్తుతం సన్నీ లియోన్ కు తనకంటూ కొన్ని సినిమాలున్నాయి. ఆమె ఉంటే బాగుంటుందని భావించే మేకర్స్ ఉన్నారు. నిత్యం వెస్ట్రన్ వేర్ లో కనిపిస్తూ అందాలు ఆరబోసే ఈ హీరోయిన్, ఒక్కసారిగా ట్రెడిషనల్ లుక్ లోకి మారితే ఎలా ఉంటుంది..? అలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే అందాలు ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నలకు సమాధానమే తాజాగా రిలీజ్ చేసిన సన్నీ లియోన్ ఫొటో షూట్. గాగ్రా చోళీలో ఆమె అందం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పంజాబీలో ఒక సినిమా, హిందీలో 2 సినిమాలు, తమిళ్ లో మరో సినిమా చేస్తోంది. ఆమె నటించిన తమిళ సినిమా విడుదలకు సిద్ధమైంది.