హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించాడు. హిందీలో “పుష్ప 2” వసూళ్ల జోరు ఇంకా ఆగడం లేదు. ఈ వీకెండ్ (జనవరి 3-5, 2025). వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా “పుష్ప 2” సినిమా 1800 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.
దీంతో ఈ సినిమా అత్యధిక వసూళ్లు అందుకున్న భారతీయ సినిమాల లిస్ట్ లో రెండో చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు “బాహుబలి 2” సినిమా పేర ఉన్న రికార్డుని “పుష్ప 2” బద్దలు కొట్టింది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు ఇప్పటికీ ఊహించని వసూళ్లు వస్తున్నాయి. అందుకే, అతి తక్కువ టైమ్ లో బాహుబలి 2″ని మించి వసూళ్లు అందుకొంది “పుష్ప 2.”
ప్రపంచవ్యాప్త వసూళ్ల పరంగా భారీ హిట్ మూవీగా అమీర్ ఖాన్ నటించిన “దంగల్” మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా దాదాపు 2100 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొంది. ఇక ఇప్పుడు 1800 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది.
“పుష్ప 2” ఇప్పటికే ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న హిందీ చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్ మనదేశంలో 800కోట్ల వసూళ్లు పొందింది.