ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, బాఫ్ట (బ్రిటిష్ ఫిలిం) అవార్డులు … ఇలా వరుసగా అవార్డుల కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి ఏడాది ఇవి వరుసగా జరుగుతాయి. ఈ సారి ఆస్కార్ రేసులో మన దేశం నుంచి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన “లాపతా లేడీస్” పోటీ పడింది. కానీ ఈ సినిమాని అవార్డుల నామినేషన్ కి కూడా వెళ్లలేకపోయింది.
ఐతే, ఈ సారి ఆస్కార్ సంగతేమో కానీ గోల్డెన్ గ్లోబ్, బాఫ్ట అవార్డుల్లో మరో భారతీయ చిత్రం “ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light) అనే చిత్రం మాత్రం పోటీలో నిలవనుంది. ఇప్పటికీ ఈ రెండు అవార్డుల లాంగ్ లిస్ట్ లో ఈ సినిమాకి చోటు దక్కింది. అంటే పోటీలో ఉన్నట్లే.
విదేశీ చిత్రం కేటగిరిలోనూ, ఉత్తమ దర్శకత్వం కేటగిరిలోనూ ఈ సినిమా బాఫ్ట అవార్డుల లిస్టులో ఉంది.
గోల్డెన్ గ్లోబ్ కానీ, బాఫ్ట అవార్డు కానీ ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది అని టాక్ ఉంది. మలయాళం, ఇంగ్లీష్ లో తీసిన ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకురాలు. ఈ సినిమాని ఇండియాలో మన తెలుగు హీరో రానా విడుదల చేశాడు. కానీ థియేటర్లో సరిగా ఆడలేదు.
దివ్య ప్రభ, కాను కస్తూరి, ఛాయ నటించిన ఈ చిత్రం ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే కథ. మొత్తంగా ముంబైలోనే సాగుతుంది కథ.