
నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ ఆయన్ని కేపీ చౌదరిగా పిలిచేవారు. గోవాలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రానికి తెలుగు నిర్మాతగా వ్యవహరించడంతో కె.పి.చౌదరి సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ సినిమా ద్వారా వచ్చిన పేరు డ్రగ్స్ కేసుతో మటుమాయం అయింది.
2023లో డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు కె.పి.చౌదరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి గోవాకి మకాం మార్చారు. కానీ డ్రగ్స్ కేసులు, ఆర్థిక కష్టాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. నిర్మాతగా సినిమాలు తీసింది పెద్దగా లేదు కానీ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత ‘కబాలి’ తెలుగు నిర్మాతగా పాపులర్ అయ్యారు.
నిర్మాతగా కన్నా డ్రగ్ పెడ్లర్ అన్న వార్తలతోనే ఎక్కువకాలం మీడియాలో నిలిచారు.