
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. మొహమాటపడడం అనేది ఉండదు. ఇటీవల బాలయ్యకి పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా బాలయ్య ఇష్టాయిష్టాల గురించి ప్రశ్నలు వేస్తే డిప్లమాటిక్ గా కాకుండా సూటిగా సమాధానాలు ఇచ్చారు.
మీకు ఇష్టమైనవి?
నా భార్య వసు, మాన్సన్ హౌజ్ (మందు బాటిల్) ఇష్టం. వసు నా అదృష్టం. నేను వసుని ఇష్టపడితే, మాన్సన్ హౌజ్ నన్ను ఇష్టపడింది.
మీతో నటించిన హీరోయిన్లలో మీ ఫెవరెట్స్ ఎవరు?
మొదట విజయశాంతి ఇష్టం. ఆ తర్వాత నాకు సరిజోడిగా అనిపించిన వారిలో రమ్యకృష్ణ, సిమ్రాన్ ఉంటారు.
ఇలా బాలయ్య సమాధానం ఇచ్చారు. బాలయ్య – విజయశాంతి దాదాపు 17 చిత్రాల్లో జోడిగా నటించారు. రమ్యకృష్ణ, బాలయ్య నాలుగైదు చిత్రాల్లో నటించారు.