ప్రియాంక మోహన్ డెబ్యూ బాగాలేదు. నానితో కలిసి చేసిన “గ్యాంగ్ లీడర్” సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి నానితోనే “సరిపోదా శనివారం” సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో “ఓజీ” సినిమా చేస్తోంది. ‘సరిపోదా శనివారం’ సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మ మెల్లమెల్లగా టాలీవుడ్ లో పాతుకుపోతోంది.
ఇప్పుడు ఈ భామ తెలుగులో బాగా బిజీ అవుతొంది. లెటేస్ట్ గా ఆమె విశ్వక్ సేన్ సరసన నటించబోతోంది.
త్వరలోనే జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో ఓ సినిమా చేయబోతున్నాడు విశ్వక్ సేన్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు. కథ విన్న వెంటనే నటించడానికి అంగీకరించింది ప్రియాంక.
విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రంగా ‘మెకానిక్ రాకీ’ చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ తో రొమాన్స్ చేస్తున్న విశ్వక్.. అనుదీప్ సినిమాలో ప్రియాంక మోహన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.