“పుష్ప-2” సినిమాకు అల్లు అర్జున్ 150 కోట్లు తీసుకున్నాడనే టాక్ ఉంది. అయితే అది చాలా తక్కువంటున్నాడు బన్నీ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాస్. ట్యాక్స్ కట్టవ్వగా.. అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో చెబుతున్నాడు.
“అల్లు అర్జున్ పుష్ప-2 కోసం 150 కోట్లు తీసుకున్నాడనుకుందాం. హీరోలకు డైరక్ట్ టాక్స్ కాబట్టి 35 శాతం పన్ను తీసేయాలి. అంటే 150 కోట్లలో 50 కోట్లు ట్యాక్స్ పోగా మిగిలింది 100 కోట్లు. ఆ సినిమా మూడేళ్లు తీశారు. అంటే సంవత్సరానికి 33 కోట్లు. అదే ఏడాదికొక సినిమా చేస్తే ఆయనకు ఇంకా ఎక్కువ వచ్చేది కదా.”
ఇది బన్నీ వాస్ లాజిక్. హీరో ఎంత తీసుకున్నాడో చూడకూడదని, హీరో మార్కెట్, మూవీ బడ్జెట్ ఆధారంగా రెమ్యూనరేషన్ చూడాలనుకుంటున్నాడు ఈ నిర్మాత.
“పుష్ప ఫ్రాంచైజీ ద్వారా ఎన్ని వందల కోట్లు వస్తోంది.. అందులో బన్నీ షేర్ ఎంత అనేది చూడాలి తప్ప. ఈయన ఒక్కడే 150 కోట్లు తీసుకుంటున్నాడని అనడం కరెక్ట్ కాదు. బిజినెస్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాడు, బిజినెస్ లేకపోతే ఊరికే ఇవ్వరు కదా. మీడియా కథనాల సంగతి పక్కనపెడితే.. నాకు తెలిసి టాలీవుడ్ లో ఏ హీరో, బడ్జెట్ లో 20 శాతానికి మించి తీసుకోవడం లేదు. ఇది పక్కా.”