ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది టీమ్.
‘‘మా అందరి నాలుగేళ్ల కష్టమే ఈ దేవర సినిమా. ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌కు ధన్యవాదాలు. నందమూరి అభిమానులకు మెమెప్పుడూ రుణపడి ఉంటాం. ఈ సినిమా కోసం కష్టపడిన కొరటాల శివగారికి థాంక్స్. శివగారు రాసిన కథకు సాబు సిరిల్‌గారు న్యాయం చేశారు. రెండేళ్లు కష్టపడ్డారాయన,” అన్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన ఈ సినిమాకి ప్రెజెంటర్.
“ఎన్టీఆర్ ఇరగదీశాడు. మాటల్లేవు. నాకెంతో గర్వంగా ఉంది. తను వన్ మ్యాన్ షో చేశాడు. గూజ్ బమ్స్ వచ్చాయి,’’ అన్నారు తన సోదరుడి నటన గురించి.
“నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటున్నారు,” అన్నారు చిత్ర దర్శకుడు కొరటాల శివ.