ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పదేళ్లపాటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్న ఆయన ఇక ఏ పార్టీలో లేను అంటూ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తమ పార్టీపై, నేతలపై అసభ్యకరంగా మాట్లాడిన / అబద్దాలు ప్రచారం చేసిన పోసాని, రామ్ గోపాల్ వర్మలపై కేసుల పరంపర మొదలైంది.
దాంతో, పోసాని ఇక కుటుంబం కోసం అంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…
- ఇక నుంచి నేను రాజకీయాలను మాట్లాడను
- ఏ పార్టీని పొగడను… మాట్లాడను… విమర్శించను…
- ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.
- రెండ్రోజుల క్రితం నా చిన్న కొడుకు అడిగాడు…. పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ అంటావు, మరి ఫ్యామిలీ ఏంటని అడిగాడు. అందుకే నా కుటుంబం కోసం…. నా పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా.
- నేను ఓ పార్టీని తిట్టాలని పొగడాలని రాజకీయాల్లోకి రాలేదు..ఓటర్ లాగే ప్రశ్నించాను.. ఎవరు కేసులు పెట్టినా, దాడులు చేసినా నేను భయపడను. ఇక నుంచి నా బిడ్డలు, నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను.