
ఒక దశలో నెంబర్ వన్ గా వెలిగింది హీరోయిన్ పూజ హెగ్డే. ఆ సమయంలో తన విజయాన్ని చూసి కొన్ని శక్తులు కుల్లుకున్నాయి. ఆ కుళ్ళు, అసూయ, ద్వేషంగా మారి తనపై ట్రోలింగ్ చేయించారని తాజాగా తెలిపింది పూజ హెగ్డే.
“తమ పీఆర్ టీంకి చెప్పి ట్రోలింగ్ బ్యాచ్ కి డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో నాపై బురద జల్లేవారు. మీమ్స్, పోస్టులతో నెగెటివ్ గా మెసేజిలు పెట్టించేవారు. నాపై ట్రోలింగ్ చేసేందుకు వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టారని తెలిసినప్పుడు షాక్ అయ్యాను,” అని తెలిపింది పూజ.
ప్రస్తుతం తన కెరీర్ ప్రశాంతంగా సాగుతోందని చెప్తోంది. పూజ హెగ్డే దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉంది. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఐతే, తమిళ, హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
తమిళంలో ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే మరో చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక హిందీలో తాజాగా వరుణ్ ధావన్ సరసన సినిమా స్టార్ట్ చేసింది. ట్రోలింగ్, అపజయాల వల్ల ఏడాదిన్నర పాటు వర్క్ లేకుండా ఇంట్లో కూర్చున్న ఈ భామ మళ్ళీ ఇప్పుడు బిజీ బిజీగా మారింది.