
ప్రతి హీరోకు ఉన్నట్టుగానే నితిన్ కు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అయితే అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ఎలాంటి సెంటిమెంట్స్ లేవంటున్నాడు. ఒకప్పుడు నీలం చొక్కా అంటే నితిన్ కు బాగా సెంటిమెంట్ అంట.
“కెరీర్ కొత్తలో సెంటిమెంట్స్ ఉండేవి. ఫ్లాపులొచ్చిన తర్వాత అవన్నీ పోయాయి. ఏదైనా ఒక సెంటిమెంట్ చెప్పాలంటే, నా దగ్గర ఓ బ్లూ షర్ట్ ఉంది. ‘ఇష్క్’ టైమ్ లో వేసుకున్నాను. సినిమా హిట్టయింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ టైమ్ లో వేసుకున్నాడు, అది కూడా హిట్టయింది. ‘హార్ట్ ఎటాక్’ అప్పుడు వేసుకున్నాడు. ఓకే యావరేజ్ గా ఆడింది. ‘అ..ఆ’ హిట్టయినా ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే. దాంతో ఆ సెంటిమెంట్ కూడా ఆపేశాను.”
ఇలా ఒకప్పుడు తన సెంటిమెంట్ ను బయటపెట్టాడు నితిన్. ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోందో కూడా చెప్పుకొచ్చాడు.
“నా పాత్ర ఓ మానిప్యులేటర్. అందర్నీ బుట్టలో వేసుకొని, తనకు కావాల్సిన పని చక్కబెట్టుకొని వెళ్లిపోతాడు. అయితే క్లయిమాక్స్ కు వచ్చేసరికి హీరో పాత్ర ఓ రేంజ్ కు వెళ్తుంది. హీరో ప్లాన్ ఏంటి, అతడి స్కెచ్ ఏంటనేది అక్కడ తెలుస్తుంది.”
వింటుంటే ఇదేదో ‘కిక్’, ‘పోకిరి’ లాంటి కథ అనుకోవచ్చు. కానీ తన కెరీర్ లోనే డిఫరెంట్ సినిమా అంటున్నాడు నితిన్.