జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఈ రోజు ఆయన ఆసీనులు అయ్యారు. మంత్రి హోదాలో తొలిసంతకం కూడా చేశారు.
పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు మరో 20 మంది జనసేన అభ్యర్థులు కూడా విజయం సాధించారు. 21 మంది MLAలు, ఇద్దరు ఎంపీలు పోటీ చేస్తే అందరూ గెలవడం ఒక రికార్డు. అలా పవన్ కళ్యాణ్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. దానికి తగ్గట్లు ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది.
తన సినిమాల విషయంలో ఇంకా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదు.