దీపిక పదుకోన్ గర్భవతి అన్న విషయం మనకు తెలుసు. ఐతే ఆమె నిజంగా ప్రెగ్నెంటా అని సందేహాలు కూడ వ్యక్తం చేసిన వాళ్ళు ఎందరో.
అందరి నోళ్లు మూస్తూ ఆమె కొత్త ఫోటోషూట్ చేసింది. తన బేబీ బంప్ ని చూపిస్తూ చేసిన ఫోటోషూట్ ఇది. ఆమెకి ఇప్పుడు ఆరో నెల. డాక్టర్లు ఆమెకి సెప్టెంబర్ లో డెలివరీ డేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇంతకుముందే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
రణ్వీర్ సింగ్, దీపిక పెళ్లి చేసుకొని ఆరేళ్ళు అవుతోంది. వీరి కాపురం గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి. విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దీపిక, రణ్వీర్ ఇప్పుడు తల్లితండ్రులు అవుతున్నారు.
మరోవైపు, ఇటీవలే ఆమె ఒక కొత్త రికార్డు పొందింది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. సినిమాకి 20 నుంచి 30 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది దీపిక. గర్భం దాల్చక దీపిక సినిమాలకు కామా పెట్టింది. వచ్చే ఏడాది మళ్ళీ నటించే అవకాశం ఉంది.
దీపికతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే మిగతా హీరోయిన్ల వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
ALSO READ: The highest-paid Bollywood actresses of 2024