దేశవ్యాప్తంగా హిట్టయింది కాంతార సినిమా. అన్నీ తానై రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా జాతీయ అవార్డుల్లో కూడా మెరిసింది. రిషబ్ కు ఉత్తమ నటుడు అవార్డ్ తెచ్చిపెట్టింది.
ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ వస్తోంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ పనిలోనే బిజీగా ఉన్నాడు. ఓవైపు ఈ సినిమా ప్రొడక్షన్ నడుస్తుంటే, మరోవైపు ఇందులో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడంటూ గతంలో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజాగా వీటిపై ఎన్టీఆర్ స్పందించాడు. కాంతార ప్రీక్వెల్ లో తను లేనని, ఒకవేళ రిషబ్ షెట్టి ఏదైనా ప్లాన్ చేస్తే, ప్రీక్వెల్ లో నటించడానికి తను ఎప్పుడూ సిద్ధమని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: NTR’s pilgrimage tour is a strategic move
ప్రస్తుతం ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలిసి కర్నాటకలోని పలు దేవాలయాల్ని సందర్శిస్తున్నారు. వీళ్లతో దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తల్లి కూడా ఉన్నారు.