ఆగస్ట్ నెలలో అటుఇటుగా 37 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వగా, చిన్న సినిమాలుగా వచ్చి సక్సెస్ అయినవి 2 ఉన్నాయి. అవి కూడా చిన్న చిత్రాలే కావడం విశేషం.
అలనాటి రామచంద్రుడు, విరాజి, లారీ, ఉషా పరిణయం, శివం భజే, బడ్డీ, యావరేజ్ స్టూడెంట్ నాని, తిరగబడరాసామీ, ల్యాండ్ మాఫియా, సింబా, దేవరకొండ పోలీస్ స్టేషన్, కేస్ నంబర్-15, సూపర్ డీలక్స్, సంఘర్షణ, పాగల్ Vs కాదల్, భవనమ్, తుఫాన్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్, మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం, యజ్ఞ, రేవు, వెడ్డింగ్ డైరీస్, డిమోంటీ కాలనీ 2, సరిపోదా శనివారం, కాలం రాసిన కథలు, ఎస్ఐ కోదండపాణి, కావేరి, నేను కీర్తన, పార్క్…. ఇలా ఆగస్టులో పలకరించాయి.
ఇందులో పెద్ద చిత్రాలు మూడు… 1) మిస్టర్ బచ్చన్ 2) డబుల్ ఇస్మార్ట్ 3) సరిపోదా శనివారం.
“మిస్టర్ బచ్చన్”, “డబుల్ ఇస్మార్ట్”పై భారీ అంచనాలుండేవి. ప్రచారం కూడా అలానే చేశారు. కానీ రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్”, రామ్ నటించిన “డబుల్ ఇస్మార్ట్” సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన “సరిపోదా శనివారం” సినిమా ఆ అంచనాల్ని అందుకుంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ… రెండో రోజు నుంచి సినిమా అందుకుంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ వసూళ్లు తగ్గకపోవడం విశేషం. అమెరికాలో ఐతే భారీ హిట్ అయింది. ఇప్పటి ట్రెండ్ ని బట్టి చూస్తే యావరేజ్ గానైనా నిలబడేలా ఉంది.
పెద్ద సినిమాల పరిస్థితి అది. ఆశ్చర్యంగా “ఆయ్” అనే చిన్న సినిమా, నిహారిక నిర్మించిన “కమిటీ కుర్రోళ్లు” అనే మరో చిన్న చిత్రం బాగా ఆడాయి. ఈ రెండు రియల్ హిట్స్. నిర్మాత బన్నీ వాస్ కు పెట్టుబడికి తగ్గ రిటర్న్స్ వచ్చాయి. నిహారిక నిర్మాతగా నిలబడింది.
ఇక విక్రమ్ నటించిన తంగలాన్ సినిమాకి మంచి పేరు వచ్చింది. రావు రమేష్ నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా నవ్వులు పంచింది. డిమోంటీ కాలనీ 2 ఓ సెక్షన్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది.