
ఎన్టీఆర్ స్పీడ్ గా సినిమాలు చెయ్యాలని భావించాడు. ప్రభాస్ లా ఒకేసారి రెండు, మూడు సినిమాలను సెట్స్ పై ఉంచాలని అనుకున్నా వర్కవుట్ కావడం లేదు. తొందరగా అయిపోతుందనుకున్న “వార్ 2” సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావడం లేదు. దాంతో, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మొదలు పెట్టాల్సిన సినిమా ఆలస్యం అవుతోంది.
అలాగే, “దేవర 2” సినిమా చెయ్యాలా వద్దా అనే విషయంలో ఇంకా మీమాంస వీడలేదు.