
ఆలియా భట్ కి తెలుగు సినిమాలపై చాలా ఆసక్తి పెరిగింది. రాజమౌళి సినిమాలో నటించాలనే ఉద్దేశంతో తానే ఫోన్ చేసి ఆయన్ని ఆఫర్ అడిగింది. అలా ఆమెకి “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో పాత్ర దక్కింది. అలాగే ఆ మధ్య త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించాలి అని ఉంది అని బహిరంగంగా ప్రకటించింది.
తాజాగా ఈ భామ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెలుగు సినిమా చెయ్యబోతోంది. “కల్కి 2898 AD” తీసిన నాగ్ ఆశ్విన్ ఆ సినిమాకి రెండో భాగం ఇప్పుడు తీయబోవడం లేదు. ప్రభాస్ వచ్చే ఏడాది వరకు నా డేట్స్ అడగొద్దు అని తేల్చి చెప్పడంతో రెండో భాగాన్ని ప్రస్తుతం పక్కన పెట్టాడు నాగ్ అశ్విన్. అందుకే, ఈ గ్యాప్ లో ఆలియా భట్ తో ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా తీయనున్నారు.