
మహేష్ బాబు – రాజమౌళి సినిమా (#SSMB29) ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది. తన సహజ పద్దతికి భిన్నంగా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యకుండా సింపుల్ గా షూటింగ్ షురూ చేశారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లోనే జరుగుతుంది. సో, ఇక్కడ తీసే సీన్లు అన్ని కంటిన్యూస్ గా తీస్తారట. రెండు, మూడు రోజులు గ్యాప్ తీసుకుంటూ అలా షూటింగ్ జరుగుతూ ఉంటుంది.
హీరోయిన్ ప్రియాంక చోప్రాకి చెందిన సీన్లు ముందుగా తీస్తున్నారు. ఆమెని ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉంచకుండా ఆమె సోలో సీన్లు, హీరో మహేష్ బాబు, ప్రియాంకకి చెందిన సన్నివేశాలు ఇప్పుడు తీస్తున్నారు.
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాప్ లో అమెరికా తిరిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న షెడ్యూల్స్ కి వస్తుందట.
ఈ సినిమాని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లోనే ఎక్కువ తీస్తారనేది నిజమే కానీ కెన్యా అడవుల్లో, విశాఖ పట్నంలో, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లో కూడా అనేక సన్నివేశాలు తీయాల్సి ఉందట.