
శ్రద్ధ శ్రీనాథ్ చాలా సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో ఆమె పోషించే పాత్రలు అన్నీ డీగ్లామ్ లేదా నెగెటివ్ గా ఉండేవే. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆమె వేరు. నిజజీవితంలో ఆమె గ్లామరస్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.
“సైన్ధవ్” చిత్రంలో ఒక పిల్లకి తల్లిగా నటించింది. సాధారణ గృహిణి పాత్ర. “మెకానిక్ రాకీ”లో విలన్ గా నటించింది. ఇక బాలయ్య హీరోగా నటించిన “డాకు మహారాజ్”లో విలన్ కి భార్యగా కనిపించింది. ఏ సినిమాలో కూడా గ్లామర్ పాత్ర లేదు.
కానీ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలు మాత్రం ఆమె సినిమా పాత్రలకు భిన్నంగా ఉంటాయి. తన గ్లామర్ సైడ్ ని చూపించే ప్రయత్నం చేస్తుంటుంది. “ఫలానా పాత్రలే చెయ్యాలని గిరిగీసుకోలేదు. ఏవైనా చేస్తాను. రియల్ లైఫ్ లో మాత్రం నా మనసుకు నచ్చినట్లు ఉంటా,” ఇది ఆమె మాట.
ఇలా రెండు రకాలుగా కనిపించే ఈ భామ వ్యక్తిగత జీవితంలో కూడా ఓక విచిత్రం ఉంది. అదేంటంటే… ఈ 34 ఏళ్ల భామకి పెళ్లి అయింది. భర్తతోనే ఉంటుంది బెంగుళూర్ లో. కానీ అతని ఫోటోలను షేర్ చెయ్యదు. అలాగే అతని గురించి రాయదు. ఈ భామ ఎక్కువగా విదేశాలు తిరుగుతూ ఉంటుంది. ఆ ట్రిప్స్ ఫోటోలను షేర్ చేస్తుంది. వాటిలోనూ ఆమె భర్త కనిపించడు. ఇదేమి రహస్యం ఏమో.

ఇంతకీ ఆమె భర్తతో ఉంటుందా లేదా అన్నది కూడా పెద్ద డౌటే.