ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి చేతిలోకి వెళ్లడం, ఒకరితో చేయాలనుకున్న దర్శకుడు, మరో హీరోవైపు మళ్లడం టాలీవుడ్ లో సహజం. అలా వెళ్లిన సినిమాల్లో కొన్ని హిట్టయితే, మరికొన్ని ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. ఇది కూడా అలాంటి ఉదంతమే.
ప్రభాస్ తో సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ వైపు వెళ్లాడు. అదే “అశో”క్ సినిమా. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో, దర్శకుడు సురేందర్ రెడ్డికి వరుసగా అవకాశాలొచ్చాయి. ఇందులో భాగంగా తన రెండో సినిమాను ప్రభాస్ తో చేయడానికి రెడీ అయ్యాడు సురేందర్ రెడ్డి.
అన్నీ దాదాపు ఫైనల్ అయ్యాయి కూడా. అప్పుడే సడెన్ గా సీన్ లోకి సురేందర్ రెడ్డికి బాగా కావాల్సిన వ్యక్తి ఎంటర్ అయ్యాడు. సీన్ మొత్తం మార్చేశాడు. అలా ప్రభాస్ తో సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ ప్రాజెక్టుపైకి వచ్చాడు.
తారక్ హీరోగా “అశోక్” సినిమా తీశాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు సురేందర్. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ ప్రభాస్ తో సినిమా చేయలేకపోయాడు. గతేడాది “ఏజెంట్” సినిమా చేశాడు ఈ దర్శకుడు. అది డిజాస్టర్ అయింది.