అక్కినేని అవార్డ్ అందుకున్నారు చిరంజీవి. అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా అవార్డ్ అందుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా అమితాబ్ కు, తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు చిరు.
‘సైరా’ సినిమాలో చిరంజీవి, బిగ్ బి కలిసి నటించారు. ఆ సినిమాలోకి అమితాబ్ ఎలా వచ్చారు? ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతనే విషయాన్ని బయటపెట్టారు.
“సైరా’ టైమ్ లో కీలక పాత్ర కోసం అమితాబ్ ను తీసుకోవాలనుకున్నాం. నేను ఆయనకు ఒక మెసేజ్ మాత్రమే పెట్టాను. ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయితే ఓకే, లేకపోతే సైలెంట్ గా ఉండిపోవాలని అనుకున్నాను. కానీ ఆయనే స్పందించాను. చేస్తానని చెప్పారు. ఎరేంజ్ మెంట్స్ కూడా వద్దన్నారు. హోటల్ లో దిగి సినిమా చేసి వెళ్లిపోతానన్నారు. చెప్పినట్టుగానే చేశారు. షూటింగ్ చివరి రోజు ఆయనకు రెమ్యూనరేషన్ ఇద్దామనుకున్నాం. ఫార్మాలటీస్ గురించి అడిగాను. కేవలం నీమీద ప్రేమతో ఈ సినిమా చేశాను, ఫార్మాలటీస్ పేరిట నన్ను అవమానించొద్దన్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.”
ఇలా సైరా సినిమాకు అమితాబ్, పారితోషికం తీసుకోలేదనే విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. అవార్డ్ అందుకున్న సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.