సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమాకి అంతా సిద్ధమైంది. జనవరి నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి బడ్జెట్ లెక్కలు కూడా కట్టారు.
మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ ఉండనుంది. ఈ సినిమాని రాజమౌళి గ్లోబల్ స్థాయిలో తీయనున్నారు. అంటే ఈ సారి హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళాలి అనేది ఆయన టార్గెట్. అందుకే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు.
మహేష్ బాబుకి పారితోషికంతో పాటు “లాభాల్లో కొంత వాటా” ఇచ్చేందుకు అంగీకరించారట. ఇక రాజమౌళి కూడా పారితోషికంతో పాటు భారీ మొత్తంలో లాభాల్లో వాటా తీసుకుంటారు. ఈ సినిమా నిర్మాణానికి, గ్రాఫిక్స్ కి పెట్టె ఖర్చు కూడా అధికంగా ఉంటుంది.
ఐతే, ఈ సినిమాకి నిజంగా 1000 కోట్ల బడ్జెట్ అవుతుందా? లేదా హైప్ కోసమా? అనేది చూడాలి. తెలుగు సినిమా రంగంలో బడ్జెట్ అనేది అయ్యే దాని కన్నా 30, 40 శాతం అధికంగా చెప్పడం అలవాటు.