![Sobhita Dhulipala and Naga Chaitanya](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/10/nagachaitanyasobhita-anrawards.jpg)
శోభిత ధూళిపాళ అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలుగా రానుంది. ఇప్పటికే నాగ చైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.
నిన్న (అక్టోబర్ 28) జరిగిన ఏఎన్నార్ అవార్డు కార్యక్రమంలో శోభిత ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కినేని కుటుంబ సభ్యులలో ఒకరిగా అక్కడ హడావిడి చేసింది. నాగ చైతన్య, శోభిత చేతిలో చెయ్యి వేసుకొని వచ్చారు.
శోభిత తల్లితండ్రులు కూడా విచ్చేశారు.
శోభిత ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. చాలా ఏళ్లుగా అక్కడే మకాం. ఆమె తల్లితండ్రులు మాత్రం వైజాగ్ లో ఉంటారు. ఇప్పుడు ఈ భామ పెళ్లి తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలి. నాగ చైతన్య ఇటీవలే హైదరాబాద్ లోని తన ఇంటిని రినోవెట్ చేశాడు.