మంచు విష్ణు హీరోగా “కన్నప్ప” సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక పాత్ర పోషించారు. “కన్నప్ప” సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్. ఈ సినిమా కోసం తన పోర్షన్ కూడా పూర్తి చేశాడు ప్రభాస్.
అయితే తమ కాంబినేషన్ కు సంబంధించి మంచు విష్ణు పెద్ద బాంబ్ పేల్చాడు. “కన్నప్ప” సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ కాంబినేషన్ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదంట. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా బయటపెట్టాడు.
ఈ సినిమాలో చాలామంది నటీనటులతో ప్రభాస్ కు కాంబినేషన్ సీన్లు ఉన్నాయంట. కానీ తనతో మాత్రం ఒక్క సీన్ కూడా లేదని స్పష్టం చేశాడు. ఈ సినిమా టీజర్ విడుదల సంధర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు విష్ణు. టీజర్ ఈ రోజు విడుదలైంది.
ఇక ప్రభాస్ లుక్ విషయానికొస్తే, కన్నప్ప టీజర్ లో కేవలం ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించి సరిపెట్టారు. పూర్తి లుక్ ను వీడియోతో పాటు 2-3 నెలల్లో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు విష్ణు. సినిమాలో ప్రభాస్ ది చాలా కీలకమైన పాత్ర అని, నిడివి గురించి మాత్రం తను ఇప్పుడే చెప్పనని అన్నాడు.