
ఒకప్పుడు తను డేటింగ్ చేసిన పుకారు నిజమేనని తెలిపింది సింగర్ కమ్ నటి మమతా మోహన్ దాస్. విజయ్ సేతుపతితో కలిసి “మహారాజ” అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తాజాగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ.. ఒకప్పటి డేటింగ్ ముచ్చట్లను ఫ్రెష్ గా బయటపెట్టింది.
లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో డేటింగ్ చేసిందట మమతా మోహన్ దాస్. ఇద్దరూ కొన్నాళ్ల పాటు బాగానే ప్రేమించుకున్నారట. అయితే ఒత్తిడితో కూడిన బంధం ఎక్కువ రోజులు నిలవదని, తమ బంధం కూడా అలానే వీగిపోయిందని చెప్పుకొచ్చింది. బ్రేకప్ కు కారణాల్ని అంతకుమించి వెల్లడించలేదు ఈ నటి.
ప్రస్తుతం ఈమె సింగిల్ గా ఉందట. జీవితానికి తోడు అవసరం లేదని, కానీ మంచి భాగస్వామి కోసం వెదుకుతున్నానని అంటోంది. త్వరలోనే మరిన్ని విషయాలు బయటపెడతానని కూడా ఊరిస్తోంది.
యమదొంగ, చింతకాయల రవి, కింగ్ వంటి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. మలయాళంలో చాలా సినిమాలు చేస్తోంది. మమతా మోహన్‌దాస్ ప్లేబ్యాక్ సింగర్ కూడా. శంకర్ దాదా జిందాబాద్‌లో ‘ఆకలేస్తే అన్నం పెడతా’ పాట పాడింది ఈమెనే.
ఆమధ్య కాన్సర్ బారిన పడింది ఈ బ్యూటీ. ఆ తర్వాత దాన్ని జయించింది. కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలు స్టార్ట్ చేసింది.