
ఒక్కహిట్.. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు. దశ తిరిగిపోతుంది, కనకవర్షం కురుస్తుంది. ఊహించని క్రేజ్ తో పాటు అమాంతం డబ్బు వచ్చి పడుతుంది. ప్రస్తుతం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది తృప్తి డిమ్రి.
“యానిమల్” సినిమా ఈ అమ్మడి జీవితాన్ని మార్చేసింది. అందులో ఆమె హీరోయిన్ కాదు, ఓ క్యారెక్టర్ రోల్ మాత్రమే. కానీ అ చిన్న పాత్రతోనే సునామీ సృష్టించింది. ఎందుకంటే, అందులో ఆమె (దాదాపు) నగ్నంగా నటించింది. ప్రేక్షకులకు కావాల్సినంత ‘తృప్తి’ అందించింది.
ఆ సినిమాతో కెరీర్ పరంగా తృప్తి కూడా సెటిలైపోయింది. ఎంతలా అంటే చేసిన ఒకే ఒక్క సినిమాతో ఆమె ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఏకంగా 14 కోట్ల రూపాయలు పెట్టి ఓ బంగ్లా కొనుగోలు చేసింది.
“యానిమల్” సినిమాతో ఆమెకు అంత డబ్బు కచ్చితంగా రాదు. ఆ సినిమా క్రేజ్ తో వచ్చిన ఇతర సినిమాల ఆఫర్లు, అడ్వాన్సులు, యాడ్స్, ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఆమె కొనుగోలు చేసిన బంగ్లా ఓ ఉదాహరణ. అందుకే చాలామంది ఒక్క సక్సెస్ కోసం పరితపిస్తుంటారు.