నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 6 రోజుల టాకీ మాత్రమే పెండింగ్ ఉంది. ఇది పూర్తయిన తర్వాత మిగిలిన 2 పాటల షూటింగ్ పూర్తి చేస్తారు. దీంతో ‘రాబిన్ హుడ్’ టోటల్ షూట్ పూర్తవుతుంది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘రాబిన్ హుడ్’ సినిమా.
ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీపావళి నుంచి సినిమా ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టబోతున్నారు. ఇక నవంబర్ మొదటి వారంలో ‘రాబిన్ హుడ్’ టీజర్ ను విడుదల చేసి, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
ఇంతకుముందు నితిన్, వెంకీ కుడుముల కలిసి ‘భీష్మ’ చేశారు. అది పెద్ద హిట్టయింది. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’తో మరోసారి కలిశారు. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.