తమన్నా గత కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. వీరి ప్రేమ ముదిరి పాకాన పడింది. ఇక పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చెయ్యడమే మిగిలి ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుంది అని మొదట వార్తలు వచ్చాయి. కానీ 2024 చివరికి వచ్చిన తర్వాత కూడా ఆ ఊసే లేదు.
ఆమె తన పెళ్లి వేడుకని వచ్చే ఏడాదికి వాయిదా వేసిందని సమాచారం.
తమన్నకి ఇప్పుడు 34 ఏళ్ళు. పెళ్లి చేసుకునే టైం. కానీ ఆమె ఇంకా పెళ్లి విషయంలో నాన్చుతోంది. విజయ్ వర్మతోనే పెళ్లి అనేది ఖాయం. అయినా ఆమె ఎందుకు ఇంకా ఆలోచిస్తోంది అనేది అర్థం కావడం లేదు అని ఆమె స్నేహితులే అంటున్నారట.
తమన్నా హీరోయిన్ గా ఎన్నో విజయాలు చూసింది. బాగా సంపాదించుకొంది. దాదాపు 20 ఏళ్ల లాంగ్ కెరీర్ ఉన్న భామ ఆమె. తమన్నా మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అన్న విషయంలో డౌటే లేదు. కానీ విజయ్ వర్మ ఆమె ముందు చాలా తక్కువ. అతనికి ఆమె అంత సంపాదన, ఆస్తులు లేవు. అయినా ఇద్దరి మనసులు కలిశాయి.
కొన్నాళ్లుగా దాదాపుగా సహ జీవనం చేస్తున్నారు. మరి కొత్త ఏడాదిలో అయినా వీరు ఏడు అడుగులు నడుస్తారా?