
అనుకోకుండా, పెద్దగా ప్లానింగ్ లేకుండానే పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు నిఖిల్. అతడు నటించిన ‘కార్తికేయ 2’ సంచలన విజయం సాధించింది.
“కార్తికేయ 2” తర్వాత నిఖిల్ విడుదల చేసిన మూడు చిత్రాలూ ఢమాల్ అన్నాయి. దాంతో నిఖిల్ కు మేటర్ అర్థమైంది. తాను మళ్ళీ పనే ఇండియా లెవల్లో హిట్ కొట్టాలంటే “రైట్” సబ్జెక్ట్ పట్టాల్సిందే అని తెలుసుకున్నాడు. దేవుడు, పురాణం, హిందూ ధర్మం వంటి అంశాలతో కూడిన చిత్రాలు దేశభక్తి వంటి అంశాలతో సినిమాలు తీయాలని అర్థం చేసుకున్నాడు నిఖిల్.
అందుకే “స్వయంభు”, “ఇండియా హౌజ్” అనే సినిమాలు స్టార్ట్ చేశాడు.”స్వయంభు” మైథలాజికల్ టచ్ తో రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో కచ్చితంగా మరో భారీ విజయం సాధిస్తామనే నమ్మకం నిఖిల్ లో కనిపిస్తోంది.
ఇక “ఇండియా హౌజ్” దేశభక్తితో కూడిన చిత్రం. ఇది కూడా పాన్ ఇండి యన్ మార్కెట్ కోసమే. ఈ రెండూ ఈ ఏడాదే రానున్నాయి. 2025లో నిఖిల్ పాన్ ఇండియన్ మంత్రం పనిచేస్తుందా లేదా అనేది చూడాలి.