
‘డాకు మహారాజ్’ సినిమాలో బాలకృష్ణ-ఊర్వశి రౌతేలా మధ్య వచ్చిన “దబిడి దబిడి” పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఊర్వశి నడుముపై, బొడ్డుపై దెబ్బలు వేస్తూ చేసే డాన్స్ అది. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
ఈ వివాదంపై ఇప్పటికే ఓసారి స్పందించిన ఊర్వశి, తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి రెస్పాండ్ అయింది. అదంతా కళలో ఓ భాగమని తేల్చేసింది.
“ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు భిన్నాభిప్రాయాలు రావడం సహజం. అవన్నీ నేను చూశాను. ఇక బాలకృష్ణ విషయానికొస్తే, ఆయన ఓ లెజెండ్. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆ స్టెప్ గురించి చర్చ అనవసరం. అదంతా ఆర్ట్ లో ఓ భాగం. బాలయ్యతో డాన్స్ కేవలం పెర్ఫార్మెన్స్ కాదు, అదొక సెలబ్రేషన్.”
బాలకృష్ణతో పనిచేయాలనే తన కల ‘డాకు మహారాజ్’తో నెరవేరిందని అంటోంది ఊర్వశి.
అంతకుముందు ఆమె ఇదే వివాదంపై సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించింది. “జీవితంలో ఏమీ సాధించలేని కొందరికి కష్టపడేవారిని విమర్శించే అర్హత లేదు.” అంటూ పోస్ట్ పెట్టింది.

ఓవైపు ఇంత వివాదం, ఇన్ని విమర్శలు చెలరేగినా బాలయ్య తగ్గలేదు. సినిమా సక్సెస్ పార్టీలో మరోసారి ఊర్వశిని తనవైవు లాక్కుంటూ అవే స్టెప్పులు రిపీట్ చేశారు. ఊర్వశి మాత్రం కొంచెం సిగ్గుపడింది.