ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా వివాదం నడుస్తోంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేది పక్కనపెడితే.. మీడియా మాత్రం రకరకాల విశ్లేషణలు చేస్తోంది. సాయితేజ్, పవన్ కల్యాణ్ వైపు ఉన్నాడని.. అందుకే వైసీపీకి మద్దతిచ్చిన బన్నీని అన్-ఫాలో కొట్టాడంటూ చెప్పుకొచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంపై నిహారిక కొణెదల స్పందించింది. ఈ వివాదం గురించి తనకేమీ తెలియదంటూనే, ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయంటూ రియాక్ట్ అయింది. అంటే, అసలు కారణం ఏంటనేది నిహారికకు తెలిసే ఉండొచ్చన్నమాట.
మెగాకాంపౌండ్ లో వివాదాలు కొత్త కాదు. చిరంజీవి-అల్లు అరవింద్, బన్నీ-చరణ్, పవన్-అల్లు అర్జున్ మధ్య అబిప్రాయబేధాలున్నాయంటూ ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ నిజం కాదంటూ వీళ్లు తమ చర్యలతో ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసి ఫొటోలు దిగుతూనే ఉన్నారు.
ఐతే, ఈ సారి ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టమైన తేడా తెలిసింది. బయటికి ఎన్ని చెప్పినా చిరంజీవి-పవన్ కళ్యాణ్ ఒక వైపు, అల్లు అర్జున్ మరోవైపు అని అర్థమైంది. కొన్నాళ్ళకు అందరూ మళ్ళీ కలిసిపోయినా ఆశ్చర్యం లేదు.