Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

మళ్లీ చంద్రబాబుతోనే Unstoppable

Cinema Desk, October 20, 2024October 20, 2024
 Nandamuri Balakrishna and Nara Chandrababu Naidu

ఈసారైనా చిరంజీవి వస్తారని అంతా ఆశపడ్డారు. అల్లు అర్జున్ ను తీసుకొచ్చి పుష్ప-2కు మరింత బజ్ తెస్తారని అనుకున్నారు. కనీసం ప్రభాస్ నైనా రిపీట్ చేస్తారని భావించారు. కానీ ‘ఆహా’ నిర్వహకులు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబును రిపీట్ చేశారు.

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్ సీజన్-4” (Unstoppable 4) మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు ప్రత్యేక అతిథిగా కనిపించబోతున్నారు. అలా అని ఇదేదో ఫ్రెష్ కాంబినేషన్ కాదు. సీజన్-2లోనే చంద్రబాబును తీసుకొచ్చారు. స్పెషల్ ఎట్రాక్షన్ గా లోకేష్ ను కూడా కూర్చోబెట్టారు.

ఇప్పుడు మరోసారి చంద్రబాబును రిపీట్ చేశారు. అన్ స్టాపబుల్ కు గెస్టుల కొరత ఉందనే టాక్ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబును పిలిచి ఆ టాక్ ను నిజం చేశారు ‘ఆహా’ మేకర్స్.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. అన్ స్టాపబుల్ కు రాజకీయ నాయకుల్ని పిలిచిన ప్రతిసారి వ్యూస్ తగ్గాయి. బజ్ కూడా తగ్గింది. ఈ విషయం తెలిసి కూడా మరోసారి చంద్రబాబును కూర్చోబెట్టడం వెనక ఆంతర్యం ఏంటో మేకర్స్ కే తెలియాలి. October 25న బాలకృష్ణ-చంద్రబాబు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. 

న్యూస్ Nandamuri BalakrishnaNara Chandrababu NaiduNBK Unstoppable 4Unstoppable 4

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Vishwambhara
    యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • Akshay Kumar and Kajal
    శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • Nani
    వెనక్కు తగ్గిన నాని
  • Kangana
    పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • Rajinikanth
    రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
  • Mrunal Thakur
    మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే
  • Arabia Kadali
    గీతా వల్ల దెబ్బతిన్న క్రిష్!
  • Alia Bhatt
    అలియాలో చాలా ఫైర్ ఉంది
  • Vijay Deverakonda
    అమ్మో ప్రీమియర్లు వద్దులే
  • Anasuya
    30 లక్షల మందిని బ్లాక్ చేసిందట
  • Pawan Kalyan and Krish
    పవన్ తో మళ్లీ సినిమా చేస్తాడంట
  • Ram Charan
    రామ్ చరణ్ ‘పెద్ది’: క్రేజీ అప్ డేట్
  • Vijay Deverakonda
    దేవరకొండకు నిరసన సెగ
  • Nara Rohith
    చవితికి నారా వారి బొమ్మ
  • Sandeep Vanga and Prabhas
    మళ్లీ క్లారిటీ ఇచ్చిన వంగ

ఇతర న్యూస్

  • యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • వెనక్కు తగ్గిన నాని
  • పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
©2025 telugu.telugucinema.com | WordPress Theme by SuperbThemes