పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులే కాదు నిర్మాతలు, జర్నలిస్టుల నుంచి కూడా ప్రచారం మొదలైంది.. తాజాగా నిర్మాత నాగ వంశీ పిఠాపురంలో షురూ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారానికి నాగవంశీ శ్రీకారం చుట్టి హల్చల్ చేస్తున్నారు.
ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యవహరించిన నాగవంశీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం డైరెక్ట్ గా రంగంలోకి దిగడం విశేషం.
నాగవంశీ “సితార ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల “భీమ్లా నాయక్” తీసిన విషయం మనకు తెలుసు. అలాగే నాగవంశీ బాబాయ్ ఎస్. రాధాకృష్ణ తన హారిక హాసిని సంస్థతో పవన్ కళ్యాణ్ తో “అజ్ఞాతవాసి” చిత్రం నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సంస్థకే సినిమాలు తీస్తారు. సో, ఆ విధంగా పవన్ కళ్యాణ్ కి, ఈ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉంది.
అందుకే, రాజకీయాల్లో లేకున్నా నాగవంశీ తమ హీరో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వెళ్లాల్సి వచ్చింది.
మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.