బ్రేకప్ పార్టీ అనే కాన్సెప్ట్ కొత్తేమి కాదు. కానీ హీరోయిన్లు బహిరంగంగా బ్రేకప్ పార్టీలు ఇవ్వడం అరుదు. బాలీవుడ్ యువ నటి అనన్య పాండే రెండు నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ కి టాటా బై బై చెప్పేసింది.
ఇద్దరూ కొట్టుకోకుండా, తిట్టుకోకుండా విడిపోయారు. ఆదిత్య రాయ్ కపూర్ కి లవ్ ఎఫైర్లు, బ్రేకప్ లు కొత్తేమీ కాదు. శ్రద్ధ కపూర్, కత్రినా కైఫ్, నిధి అగర్వాల్, సోనాక్షి సిన్హా… ఇలా ఓ డజన్ మంది బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. సో, అనన్య పాండే ఈ లిస్ట్ లో మరో టిక్ మార్క్ అంతే.
ఐతే, అనన్య పాండే మాత్రం ఆదిత్య రాయ్ కి బ్రేకప్ చెప్పినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు ఉంది. అందుకే తన మిత్రురాళ్లకి పెద్ద పార్టీ ఇచ్చిందట. ఆ ఫోటోలు ఇప్పుడు బయటికి వచ్చాయి.
ALSO READ: Ananya Panday breaks up with her boyfriend!
“లైగర్” సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అనన్య పాండే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కి క్లోజ్ ఫ్రెండ్.