
నాగచైతన్య డెబ్యూ మూవీ ‘జోష్’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతోనే నాగచైతన్య వెండితెరకు పరిచయమయ్యాడు. ఇన్నేళ్లకు ఆ సినిమా టాపిక్ వచ్చింది.
‘తండేల్’ సాంగ్ లాంఛ్ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు నాగచైతన్య. ఓ స్టూడెంట్ మాట్లాడుతూ, తనకు ‘జోష్’ సినిమా అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని, ఆ సినిమా రీ-రిలీజ్ చేస్తే చూడాలని ఉందని కోరాడు.
దీనికి నాగచైతన్య అంతే జోష్ గా రెస్పాండ్ అయ్యాడు. ‘తండేల్’ సక్సెస్ తర్వాత ‘జోష్’ రీ-రిలీజ్ పెట్టుకుందామని అన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం మార్మోగిపోయింది.
నిజానికి హిట్ అయిన సినిమాల్నే రీ-రిలీజ్ చేస్తుంటారు. హీరో ఫ్యాన్ బేస్ బట్టి కొన్ని ఫ్లాప్ అయిన సినిమాల్ని కూడా రీ-రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. ప్రభాస్ నటించిన కొన్ని పాత సినిమాలు అలానే వచ్చాయి. ఇప్పుడు నాగచైతన్య నటించిన ‘జోష్’ సినిమాను కూడా అదే కోవలో మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి.