
ఎన్టీఆర్ పై స్పందించడం ఐశ్వర్య రాజేష్ కు కొత్తేం కాదు. కొన్నేళ్లుగా తారక్ పై తనకున్న అభిమానాన్ని ఆమె చాటుకుంటోంది. ఈసారి ఇంకాస్త ముందుకెళ్లింది. మరో అడుగు ముందుకేసి ఇంకో స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఈసారి తారక్ ను వదిలేదే లేదంటోంది ఐశ్వర్య రాజేష్. ఎప్పటికైనా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తానని, అతడ్ని వదిలేది లేదని తెగేసి చెప్పేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, అదే ఊపులో తారక్ సినిమాలో కనిపించాలని తహతహలాడుతోంది.
‘స్టూడెంట్ నంబర్ వన్’ సినిమా నుంచి ఎన్టీఆర్ ను ఫాలో అవుతోందంట ఐశ్వర్యా రాజేష్. అతడి డాన్స్, ఎమోషన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని…. ప్రతి సినిమాతో ఎన్టీఆర్ తనను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడని అంటోంది.
ఐశ్వర్య రాజేశ్ తాజా కామెంట్స్ తో పాటు, గతంలో ఆమె ఎన్టీఆర్ ను పొగిడిన క్లిప్స్ ను అతడి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్లిప్స్ చూసైనా తారక్, ఆమెకు ‘ఒక్క ఛాన్స్’ ఇస్తాడేమో చూడాలి.