
చిన్నహీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేదు. ఏదైనా అంశం దొరికితే ట్రోల్ చేయడానికి సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న హీరో ఫొటోలతో సోషల్ మీడియాలో ఆడుకున్న సందర్భాలు కోకొల్లలు.
ఇప్పుడు అదే భయం విశ్వక్ సేన్ కు పట్టుకుంది. ‘లైలా’ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్. ఆ ఫొటోల్ని మాత్రం సోషల్ మీడియాలో వాడొద్దని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ హీరో.
“లైలా గెటప్ లో ఉన్న నా ఫొటోలు మాత్రం వాడొద్దు ప్లీజ్. జస్ట్ చూసి వదిలేయండి. ఎంత బాగున్నా కానీ సోషల్ మీడియాలో వాడొద్దు. నా ఫొటోలు ఎలా వాడేస్తారో అనే భయం ఉంది. లైలా గెటప్ లో కత్తిలా ఉన్నానని పొగిడి, అక్కడితో ఆపేయండి. అంతకుమించి వెళ్లొద్దు.”
‘లైలా’ సినిమాతో మరో ప్రయోగం చేశానని, తన కెరీర్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇదొక్కటేనని అంటున్నాడు విశ్వక్. వాలంటైన్స్ డే కానుకగా వస్తున్న ఈ సినిమాను సింగిల్స్ అంతా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు.