
కోట్లాది మంది వచ్చే కుంభమేళాకు సెలబ్రిటీలు వెళ్లడం దాదాపు అసాధ్యం. ఆ జనం మధ్య నుంచి వాళ్లను తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడం, భద్రతా వ్యవహారాలు చూసుకోవడం కష్టమైన విషయం. అలాంటి కుంభమేళాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.
నమ్మబుద్ధి కావడం లేదు కదా. నిజమే, నమ్మాల్సిన అవసరం లేదు. చరణ్, బన్నీ ఎక్కడికీ వెళ్లలేదు. ఒకవేళ వాళ్లు కుంభమేళాకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు పనిపెట్టారు కొంతమంది. అలా రూపుదిద్దుకున్నవే ఈ ఫొటోలు.
ఇలా ఏఐ సహాయంలో వివిధ సందర్భాల్ని రీ-క్రియేట్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మొన్నటికిమొన్న సైఫ్ హాస్పిటల్ బెడ్ పై ఎలా ఉండొచ్చు అనే ఆలోచనకు ఏఐతో ఓ రూపునిచ్చారు.
అంతకంటే ముందు.. టాలీవుడ్ హీరోలు స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందంటూ, ఆ గెటప్స్ తో మన హీరోలు ఫొటోల్ని ఏఐ చేశారు. మొన్నటివరకు హీరోల ఫొటోల్ని మార్ఫింగ్ చేయడానికి మాత్రమే ఏఐని ఉపయోగించిన కొంతమంది, ఇప్పుడిలా తమ క్రియేటివిటీకి పని పెడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల ఫస్ట్ లుక్స్ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. అవి ఒరిజినల్ ఫస్ట్ లుక్స్ కావు.