
సాధారణంగా తెలుగు హీరోలకు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వంటి వారికి ముహూర్తాల పిచ్చి ఉంటుంది. తమ సినిమాలను ఫలానా టైంకే మొదటి షో వెయ్యాలని బాలయ్య చెప్తుంటారు. “ఎన్టీఆర్ కథానాయకుడు”, “వీర సింహారెడ్డి” వంటి సినిమాలకు అలాగే చేశారు. రిలీజ్ కు ముందు అర్ధరాత్రి వేసే షోలకు అలా ముహూర్తం పెట్టి షో రన్ చేసేవారు.
ఇప్పుడు ఈ పద్దతికి మోహన్ లాల్ కూడా వచ్చారు. ఆయన నటించిన “ఎల్ 2” (లూసిఫర్ సీక్వెల్) ఈ నెల 27న విడుదల కానుంది. ఐతే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆ రోజు ఉదయం 6 గంటల ముహూర్తానికి విడుదల అవుతుందట. మొదటి ఆటకి అలా ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు.
అక్టోబర్ 5, 2023న ఫరీదాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరిగింది.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 26న ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా మోహన్‌లాల్ పాత్రను గ్రాండ్‌గా రివీల్ చేయడంతో అభిమానులలో అంచనాలను మరింత పెంచింది.