Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

సీనియర్ హీరో లీగల్ కష్టాలు

Cinema Desk, October 14, 2024October 14, 2024
Mohanlal

స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్, ఏ ముహూర్తాన బ్యారోజ్ సినిమాను ప్రారంభించాడో కానీ అప్పట్నుంచి ఆ సినిమాకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఒక దశలో మోహన్ లాల్ అనారోగ్యానికి కూడా గురయ్యారు.

ఇప్పుడీ సినిమా మరోసారి ఈ నటుడికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. బ్యారోజ్ సినిమా కాపీరైట్ చిక్కుల్లో పడింది. జార్జ్ తుండిపరంబిల్ అనే వ్యక్తి ఈ సినిమాపై కేసు వేశాడు. రిలీజ్ కాకుండా ఆపాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో మోహన్ లాల్ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నట్టయింది.

బ్యారోజ్ అనేది పిల్లల చుట్టూ తిరిగే ఫాంటసీ కథతో వస్తున్న సినిమా. స్వీయ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు, తను రాసిన మాయ అనే నవలలో పారాగ్రాఫులకు దగ్గరగా ఉన్నాయని ఆరోపిస్తున్నాడు జార్జ్.

చాలా కాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాలి. అయితే తాజా కేసు వల్ల సినిమా ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే హేమ కమిటీ రిపోర్ట్ తో ఇబ్బందులు పడుతున్న ఈ నటుడు.. ఇప్పుడీ లీగల్ ఇష్యూను ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.

న్యూస్ BarrozMohanlalబ్యారోజ్మోహన్ లాల్

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Pawan Kalyan in Hari Hara Veera Mallu
    స్టంట్ మాస్టర్ పవన్ కల్యాణ్
  • Trisha
    షుగర్ బేబీ త్రిష అందాలు
  • Sukumar and Ram Charan
    చరణ్ నెక్ట్స్ సుక్కుదేనంట!
  • Raghu Babu
    రఘుబాబు పాట ప్రయాస!
  • RGV
    కియరాపై వర్మ ‘చిల్లర’ పోస్ట్
  • Aarti Ravi
    ఆర్తికి నెలకు 40 లక్షలు కావాలంట
  • Kiara Advani
    అటెన్షన్ అంతా కియరాదే
  • Vishal and Sai Dhansika
    విశాల్ కాబోయే భార్య: ఎవరీ ధన్సిక?
  • Manoj and Vishnu
    శివయ్య అని పిలిస్తే రాడు!
  • ivana
    ఇవానా అసలు పేరు ఏంటంటే
  • Theater
    జూన్ 1 నుంచి థియేటర్లు బంద్!
  • Trivikram and Pawan Kalyan
    హరిహర వీరమల్లులో త్రివిక్రమ్
  • Ananya Panday
    కోడి కాళ్ల హీరోయిన్!
  • Rashmika and Vijay Deverakonda
    మంచి మనసున్న అమ్మాయి!
  • Jayam Ravi
    రవి వల్లే 100 కోట్ల నష్టం!

ఇతర న్యూస్

  • స్టంట్ మాస్టర్ పవన్ కల్యాణ్
  • షుగర్ బేబీ త్రిష అందాలు
  • చరణ్ నెక్ట్స్ సుక్కుదేనంట!
  • రఘుబాబు పాట ప్రయాస!
  • కియరాపై వర్మ ‘చిల్లర’ పోస్ట్
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us