బాలకృష్ణతో ఒక్కసారి కనెక్ట్ అయితే ఎవరైనా ఆయన ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. బయట ఆయనపై చాలా పుకార్లు వినిపిస్తుంటాయి, కానీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయమున్నవాళ్లు మాత్రం కొత్త కొత్త విషయాలు చెబుతుంటారు. నిర్మాత నాగవంశీ కూడా అదే చెబుతున్నాడు.
“బాలయ్యతో వర్క్ ఎక్స్ పీరియన్స్ నాకే ఆశ్చర్యమేసింది. ఆయన కలిసిపోయే విధానం అద్భుతం. ప్రతి చిన్న విషయానికి వెళ్లి ఆయన దగ్గర కూర్చునేంత యాక్సెస్ ఉంటుంది. ఆయన చాలా నార్మల్ గా, ఈజీగా రియాక్ట్ అవుతారు. బాలయ్య గురించి బయట చెప్పేవన్నీ పిచ్చి మాటలు. చిన్న చిన్న విషయాలు కూడా వెళ్లి ఆయనతో మాట్లాడుకోవచ్చు, అంత ఫ్రీడమ్ ఇస్తారు.”
బాలయ్య దగ్గర మేనేజర్లు ఉండరని, నేరుగా కాల్ చేసి మాట్లాడతానని అంటున్నాడు నాగవంశీ. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ నిర్మాత, తన హీరోపై బయట జరుగుతున్న ప్రచారాన్ని ఒక్క మాటలో తీసిపారేశారు.
సెల్ఫీలు దిగేందుకు వచ్చే ఫ్యాన్స్ ని బాలకృష్ణ కొడుతున్న వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి. అలాగే సెట్ లో ప్రొడక్షన్ మేనేజర్లను, మేకప్ మెన్లను కూడా కొడుతుంటారు అని ప్రచారం ఉంది. ఇంకా మరికొన్ని ‘బ్యాడ్ రిమార్క్స్’ ఉన్నాయి. కానీ బాలకృష్ణ గురించి బ్యాడ్ గా జరుగుతున్న ప్రచారం నిజం కాదంట.
బాలయ్య-బాబి సినిమాను ముందుగా దసరాకు అనుకున్నారట. అయితే ఎన్నికల వల్ల లేట్ అయిందంట. క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామంటే, అప్పటికి వర్క్ పూర్తవ్వదంట. అందుకే సంక్రాంతికి వస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు.