సమాజంలో నెగెటివిటీ బాగా పెరిగిపోయిందని ఈమధ్య ఎన్టీఆర్ అన్నాడు. సినిమాను సినిమాలా చూడడం లేదని బాధ వ్యక్తం చేశాడు. ఇలాంటి నెగెటివిటీని హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువగా ఎదుర్కొంటారు. తాజాగా అలాంటి దాని బారిన పడింది అనన్య నాగళ్ల.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ, తన సినిమా అప్ డేట్స్ మాత్రమే కాకుండా, మధ్యమధ్యలో చిన్న చిన్న మెసేజ్ లు కూడా ఇస్తుంటుంది. అలాగే ఈమధ్య ఓ వీడియో పెట్టింది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించమని ఆ వీడియోలో కోరింది అనన్య.
అందులో ఎలాంటి తప్పులేదు. కానీ కొంతమంది అనన్యను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకున్నారు. నువ్వు తగ్గిస్తున్నావా వినియోగం అంటూ ట్రోలింగ్ షురూ చేశారు. దీంతో అనన్య మరో వీడియో పెట్టింది. ఎందుకంత నెగిటివిటీ అంటూ ప్రశ్నించింది.
“ప్లాస్టిక్ వినియోగం తగ్గించమని ఓ వీడియో చేశాను. ఆ వీడియోలో తప్పు ఏముంది? ఇంత ట్రోలింగ్ ఎందుకు. చిన్న విషయం చెప్పాను. నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. ఇంత నెగెటివిటీ పనికిరాదు.”
“పొట్టేల్” అనే సినిమా చేసింది అనన్య నాగళ్ల. 25వ తేదీన రాబోతున్న ఆ సినిమా కోసం గట్టిగా ప్రచారం చేస్తోంది.