హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. ఉన్న తక్కువ టైమ్ లోనే ఎక్కువ సినిమాలు చేయాలి, రెండు చేతులా సంపాదించుకోవాలి, పనిలోపనిగా క్రేజ్ తెచ్చుకోవాలి. ప్రస్తుతం అదే పనిలో ఉంది మీనాక్షి చౌదరి.
గుంటూరుకారం సినిమా టైమ్ లోనే ఆమె వరుసగా సినిమాలకు సైన్ చేసింది. ఆ సినిమాలన్నీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంకా చెప్పాలంటే.. జస్ట్ నెల రోజుల గ్యాప్ లో మీనాక్షి నుంచి 3 సినిమాలొస్తున్నాయి. వీటిపై ఆనందం వ్యక్తం చేసింది ఈ ముంబయి బ్యూటీ.
“ఒకేసారి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి కోసం గడిచిన రెండేళ్లుగా కష్టపడ్డాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఈ 3 సినిమాల్లో నాకు 3 డిఫరెంట్ పాత్రలు దక్కాయి. అది నా అదృష్టం.”
‘లక్కీ భాస్కర్’ సినిమాలో తల్లిగా నటించింది మీనాక్షి. ఈ సినిమా ఈనెల 31న రిలీజ్ అవుతోంది. ఇక ‘మట్కా’ సినిమాలో రెట్రో లుక్ లో, 80ల నాటి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 14న వస్తోంది. ఇక నవంబర్ 22న ‘మెకానిక్ రాకీ’ వస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ సరసన గ్లామర్ డాల్ గా కనిపించబోతోంది.