తెలుగులో మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని ప్రకటించాడు హీరో దుల్కర్ సల్మాన్. కంటెంట్ సినిమాలు చేస్తున్న ఈ నటుడు, మల్టీస్టారర్ లో యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అన్నాడు. ప్రభాస్ తో ఎప్పుడైనా సిద్ధం అని ప్రకటించాడు.
“ఎన్టీఆర్ తో టచ్ లో ఉంటాను. రామ్ చరణ్ తో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతుంటాను. నాని, రానా కూడా చాలా క్లోజ్. వీళ్లలో ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయడానికి నేను రెడీ. నా నుంచి ఓ యాక్షన్ సినిమా కావాలని అడుగుతున్నారు కాబట్టి, చేసే మల్టీస్టారర్ ఏదో యాక్షన్ సినిమానే చేద్దాం.”
‘లక్కీ భాస్కర్’ మూవీ ప్రమోషన్స్ లో మల్టీస్టారర్ పై తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టాడు దుల్కర్. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నాడు. ‘కల్కి’లో కీలక పాత్ర పోషించిన దుల్కర్, ఆ సినిమా సీక్వెల్ లో తను ఉంటానా లేదా అనే విషయం తనకే తెలియదన్నాడు.
కేవలం వైజయంతీ మూవీస్ బ్యానర్, ఆ నిర్మాతలు, దర్శకుడితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ‘కల్కి’ సినిమాలో నటించానని.. పార్ట్-2లో తనను కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా దర్శకుడు నాగి తీసుకుంటాడని, అది అతడికే వదిలేస్తున్నానని వెల్లడించాడు.