‘మత్తు వదలరా 2’… రీసెంట్ గా వచ్చిన చిన్న సినిమాల్లో హిట్టయిన మూవీ ఇది. శ్రీసింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది.
రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ, అంచనాలను అందుకొని వసూళ్ల వర్షం కూడా కురిపించింది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందనే విషయాన్ని విడుదలకు ముందే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడా స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. రేపు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. ఓటీటీలో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే, థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘జాతిరత్నాలు’ సినిమా ఓటీటీలో ఫ్లాప్ అయింది. అందుకే ‘మత్తువదలరా 2’ ఓటీటీ ఫలితంపై అందర్లో ఆసక్తి నెలకొంది. వెన్నెల కిషోర్, అజయ్, సునీల్, రోహిణి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాలభైరవ సంగీతం అందించాడు.