ఇటీవల తన తండ్రితో గొడవపడి వార్తల్లో నిలిచిన మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌనిక కుటుంబం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంది. ప్రస్తుతం ఆమె సోదరి టీడీపీలోనే ఉంది. ఐతే, మౌనిక మాత్రం జనసేనలో చేరే అవకాశం ఉందట.
మనోజ్ కి కూడా రాజకీయాలపై ఆసక్తి ఎక్కువే. ప్రస్తుతం సినిమాలు కూడా పెద్దగా లేవు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న “భైరవం” అనే సినిమాలో మనోజ్ ఒక పాత్ర పోషిస్తున్నాడు. అది తప్ప ఇంకోటి లేదు. అందుకే రాజకీయం బెటర్ అనుకుంటున్నట్టు టాక్.
పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన కూడా ఇతర పార్టీలకు చెందిన నేతలను, కొంచెం జనానికి తెలిసిన వారిని చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మరి జనసేనలో మనోజ్ చేరిక నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే, ఎంట్రీ ఎప్పుడు అనేది చూడాలి.