“పుష్ప 2” అమెరికాలో సంచలన వసూళ్లు అందుకొంది. ఇప్పటివరకు ఈ సినిమా 13 మిలియన్ డాలర్ల వసూళ్లను పొందింది. ఆల్ టైం అతిపెద్ద వసూళ్లు పొందిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మరో నెల వరకు పెద్ద సినిమాలు ఏవీ లేవు. సో, ఈ సినిమాకి ఇంకా వసూళ్లు రావొచ్చు. ఆ లెక్కన ఈ సినిమా 15 మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. అంటే ఇంకా రెండు మిలియన్ డాలర్లు రావాలి. అలా చేస్తే ఈ సినిమా రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్” సినిమాని దాటిపోతుంది. “ఆర్ ఆర్ ఆర్” స్థానం అవుట్ అవుతుంది.
రాజమౌళి ఒక బ్రాండ్ నేమ్. పైగా ఆ సినిమాలో ఇద్దరు బడా హీరోలు నటించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ సినిమా మొదట 14.2 మిలియన్ వసూళ్లు అందుకొంది. ఆ తర్వాత ఆస్కార్ అవార్డు సమయంలో మరోసారి విడుదల చేస్తే మరింతగా వసూళ్లు పొంది… దాని మొత్తం వసూళ్లు 15 మిలియన్ల డాలర్లుగా మారింది.
“పుష్ప 2” ఈ సినిమాని దాటాలి. అలాగే “పుష్ప 2″ని కొన్న డిస్ట్రిబ్యూటర్ కి లాభాలు రావాలన్నా మరో మిలియన్ డాలర్ సంపాదించడం తప్పనిసరి. ఏతావాతా ఇంకో రెండు మిలియన్ల సాధిస్తే, ఈ సినిమా లాభాలు చూడడమే కాదు “ఆర్ ఆర్ ఆర్” స్థానానికి ఎసరు పెడుతుంది.