కీర్తి సురేష్ ఇటీవలే తన లవర్ ని పెళ్లాడింది. తాజాగా ఆమె తన పెళ్ళికి సంబందించిన కొత్త ఫోటోలను కూడా షేర్ చేసింది. మొదట ఈ జంట హిందూ సంప్రదా ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్రెస్తవ మతాచారాల ప్రకారం పెళ్లాడారు. తాజాగా ఆమె క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకొంది.
ALSO CHECK: Keerthy Suresh shares her Christian-way wedding pictures
ఆమె భర్త పేరు ఆంటోని. గల్ఫ్ లో వ్యాపారవేత్త. చిన్నప్పుడు ఆమెతో చదువుకున్నారు. టీనేజ్ లో ఉన్నప్పటి నుంచే అతన్ని ప్రేమిస్తోంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి కూడా దుబాయ్ లో సెటిల్ అవొచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
ఆంటోనీ, కీర్తిసురేష్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత కూడా మరో ఏడాది కలిసి చదువు కొనసాగించారు. చిన్నప్పట్నుంచి ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలో పలు వ్యాపారాలున్నాయి. అందుకు తగ్గట్టే ఆంటోనీ అమెరికాలో బిజినెస్ మేనేజ్ మెంట్, ఇంజినీరింగ్ కోర్సులు చేశాడు.ఆ తర్వాత అతడు ఖతార్ లో ఓ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు.
ఉద్యోగుల సైకాలజీ, వర్క్ కల్చర్ లాంటి ఎన్నో విషయాల్ని అక్కడ ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అమెరికాలో చదువుతున్న టైమ్ లోనే కీర్తిసురేష్ కు ప్రపోజ్ చేశాడట ఆంటోనీ. చాన్నాళ్లు పెండింగ్ లో పెట్టి ఆ తర్వాత ఓకే చెప్పిందట కీర్తిసురేష్. ఆ తర్వాత అతడి కోసమే 2 సార్లు ఆమె దుబాయ్ కూడా వెళ్లొచ్చింది. వాళ్ల ఫస్ట్ డేటింగ్ దుబాయ్ లోనే జరిగింది.
ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. కాపురం కూడా దుబాయిలోనే పెడుతారు అనే టాక్ ఉంది.
కానీ కీర్తి సురేష్ టీం మాత్రం అది నిజం కాదంటోంది. ఆమె ఇక్కడే ఉంటుందట.ఆమె భర్త కూడా ఇండియా నుంచే ఇక వ్యాపార కలాపాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నాడట.